వేల్పూర్ మండలంలో లక్కోర, వేల్పూర్ గ్రామాలలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు శుక్రవారం గ్రామ పంచాయితీలను సందర్శించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, నర్సరీ, డంపింగ్ యార్డ్స్, నీటి సరఫరా గురించి సంబంధిత పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. వేల్పూర్ గ్రామంలోని నర్సరీ, డంపింగ్ యార్డ్స్, నీటి సరఫరా గురించి పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు.