వేల్పూర్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాలలో శనివారం కుటుంబ ఇంటింటా సమగ్ర సర్వే నిర్వహించారు. సర్వేలో భాగంగా యజమాని కుటుంబ స్థితిగతులు ఆస్తుల వివరాలు, కుటుంబం పిల్లలు, ఆర్థిక, కుల గణన చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.