హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా నసురుల్లాబాద్ మండలంలో గురువారం బంద్ చేపట్టాలని హిందూ సంఘాల ఐక్యవేదిక బుధవారం పిలుపునిచ్చింది. వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్ కు సహకరించాలని సూచించారు. ఉదయం 11 గంటలకు ఎక్స్ రోడ్డు నుండి నస్రుల్లాబాద్ రామ మందిరం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు హిందూ సంఘాల సభ్యులు తెలిపారు.