బాన్సువాడ: ఇంటి పై నుండి పడి వ్యక్తి మృతి

60చూసినవారు
బాన్సువాడ: ఇంటి పై నుండి పడి వ్యక్తి మృతి
బాన్సువాడ కెసిఆర్ కాలనీలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూం ఇంటిపై పడుకున్న ప్రభు అనే వ్యక్తి నిద్రలేచి నిలబడగానే ఒకే సారి ఈదురు గాలులు రావడంతో బిల్డింగ్ నుండి ఎగిరి కింద పడి మృతి చెందాడు. ఈదురు గాలులు వీచే సమయంలో పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం విని బిల్డింగ్ నుండి అందరూ బయటకు వచ్చి చూసే సరికి ప్రభు క్రిందపడి తల పగిలి మృతి చెందాడు. కాలని వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్