బాన్సువాడ వీక్లీ మార్కెట్‌లో సోమవారం రిటైర్డ్ ఎంపీడీవో సాయిరెడ్డికి చెందిన స్కూటీ డిక్కీ నుంచి దొంగ లక్ష రూపాయలు అపహరించాడు. తాడ్కోల్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని కూరగాయలు కొనుగోలు చేస్తున్న వేళ స్కూటీని పక్కకు పార్క్ చేశాడు. ఫాలో అయిన దొంగ చోరీ చేసినట్లు సీసీ ఫుటేజ్‌లో కనిపించింది. సీఐ అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.