బీర్కూర్ మండలం వీరపూర్ గ్రామానికి చెందిన సాంబయ్య కూతురు వివాహం డిసెంబర్ 12, 2024న జరిగింది. కళ్యాణ లక్ష్మి కోసం అప్లై చేద్దామని వెళ్లగా అప్పటికే సాంబయ్య భార్య పేరుపై కళ్యాణ లక్ష్మి మంజూరైనట్లు ఉండటంతో తహశీల్దార్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వీఆర్ఏ గణేశ్ తప్పుడు పత్రాలు సృష్టించి 2019లో డబ్బులు స్వాహా చేసినట్లు గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోని కళ్యాణ లక్ష్మి ఇప్పించాలని బాధితులు మంగళవారం కోరుతున్నారు.