నసురుల్లాబాద్ లో కవిత జన్మదిన వేడుకలు

80చూసినవారు
నసురుల్లాబాద్ లో కవిత జన్మదిన వేడుకలు
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు మాజీ మున్సిపల్ ఛైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కవితకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకుడు నర్సింలు గౌడ్, టేకుల సాయిలు, మోచి గణేష్, వెంకట్, మంగళ సాయి, రమేష్ యాదవ్, శేఖర్, గంగారాం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్