నస్రుల్లాబాద్ మండలం ధాన్యంలో తరుగు తీస్తే ఉపేక్షించేది లేదని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. మండలం లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. మిల్లర్లు తరుగు, తూకం పేరిట ఏమైనా ఇబ్బందులు పెడితే తమ దృష్టి కి తేవాలన్నారు.