కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం కిష్టాపూర్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొనడంతో ఇద్దరు బైకిస్టులు ఇల్తేమ్ నర్రా గంగారం (40), నందు(18) తలలు పగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరిధీ చించోలి కాగా మరొకరిది అన్నారం. ఈ ప్రమాదంతో రెండు గ్రామల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.