ఆన్ లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ ఆన్లైన్ గేమ్స్ కు బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. తండ్రి ఫోన్ నుండి రూ. 5వేలు తీసుకుని బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్నాడు. నగదు పోయిందనే మనస్థాపంతో మంగళవారం రాత్రి గ్రామ శివారులో ఉరేసుకొని మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. తండ్రి మాగిరి పోశెట్టి ఫిర్యాదుతో బుధవారం కేసు నమోదు చేశారు.