రుద్రూర్: పౌర్ణమి పురస్కరించుకొని గంగమ్మ తల్లికి పూజలు

52చూసినవారు
రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్), రుద్రూర్ గ్రామాల్లో సత్యగంగా పౌర్ణమి పురస్కరించుకుని బుధవారం గంగమ్మతల్లి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవికి తీపి నైవేద్యాలు సమర్పించిన అనంతరం భక్తులు చెరువులో తెప్పలను విడిచి పూజలు చేశారు. భక్తులు బారులు తీరడంతో చెరువు గట్టుల వద్ద పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో సమీప గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్