ప్రధాని మోదీ వికసిత భారత్ కల సాకారం కావాలంటే బీజేపీని మరింత బలోపేతం చేయాలని ప్రజలను పార్టీలోకి ఆహ్వానించడానికి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ఆదివారం బాన్సువాడ సెగ్మెంట్ బీర్కుర్ మండల కేంద్రంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిందని బీజేపీ ఓబిసి రాష్ట్ర నాయకులు మక్కన్న తెలిపారు. ఈ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోందని, ప్రజలు స్వచ్చంధంగా వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారన్నారు.