బోధన్: బీవీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు

50చూసినవారు
బోధన్: బీవీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భారతీయ విద్యార్థి సేన పట్టణ అధ్యక్షుడు కస్ప లింగం ఆధ్వర్యంలో సోమవారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కస్ప లింగం మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత, దళితుల ఆరాధ్య దైవం, ప్రపంచం గర్వించదగ్గ మహనీయుడు, భారతరత్న బిరుదాంకితుడు అని అభివర్ణించి, ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్