చైత్ర శుద్ధ పౌర్ణమి హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం బ్రాహ్మణ గల్లిలోని నిఖిల్ ధామ్ ధ్యాన కేంద్రం వద్ద ప్రతి సంవత్సరం వలే హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. భక్తుల కొరకై అన్నప్రసాద వితరణ నిర్వహించడం జరిగిందనీ, దీనికి కాలనీవాసులు మరియు భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుందని స్థానిక సభ్యులు, కమిటీ నిర్వాహకులు సాయ గౌడ్ తెలిపారు.