అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులను పంపించాలని సామాజిక కార్యకర్త సనా పటేల్ కోరారు. బోధన్ పట్టణంలోని 18వ వార్డులో బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి తల్లులకు అంగన్వాడీ కేంద్రం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు పౌష్టికాహారం అందజేస్తారని వివరించారు. బాల్య దశ అంటే పాఠశాలకు వెళ్లడానికి చిన్నారులలో అవగాహన కలుగుతుందని వివరించారు.