బోధన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

82చూసినవారు
బోధన్: గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి
బోధన్ మండలం కల్దుర్కి రాజన్న చౌరస్తా వద్ద బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. రోడ్డు దాటుతున్న జింకను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జింకకు తీవ్రగాయాలు కావటంతో రూరల్ పోలీసులకు, ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని జింకకు నీరు తాగించిన బలంగా గాయం కావడంతో జింక మృతి చెందిందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్