
త్వరలో చిన్నారుల సంరక్షణ కేంద్రాల ఏర్పాటు
AP: మహిళా ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగం చేసే మహిళలు పిల్లల ఆలనాపాలనా చూసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది. అందుకే పని ప్రదేశాల్లో క్రెష్లు (చిన్నారుల సంరక్షణ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో 216 ప్రాంతాల్లో క్రెష్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిర్ణయం మహిళా ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తుంది.