నవీపేట్ మండలం జన్నెపల్లి ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన క్యామాజీ సబితా-సంజీవరావు దంపతులు మంగళవారం 11,500 రూపాయల విలువగల వంట పాత్రలను అలాగే 5 వేల రూపాయల విలువ గల సిలిండర్ ను పాఠశాలకు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అలాగే భవిష్యత్తులో పాఠశాలకు ఏ అవసరం ఉన్నా తన వంతు సహాయం చేయడానికి కృషి చేస్తానని అన్నారు.