చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని బోధన్ మండల విద్యాశాఖ అధికారి నాగయ్య సూచించారు. శుక్రవారం బోధన్ పట్టణంలోని క్రీసెంట్ పాఠశాలలో జరిగిన ఇంట్రా స్కూల్ మెగా క్విజ్ పోటీలలో పాల్గొన్న ఆయన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబద్ధతతో చదువుకోవడం ద్వారానే జీవితంలో ఉన్నత స్థితిని చేరవచ్చని అన్నారు. చదువు కోవడానికి ప్రస్తుతం ఎటువంటి వనరుల కొరత లేదని అన్నారు.