బోధన్ పట్టణంలోని రాకసిపేట్ ప్రాంతంలో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మాఘమాస శుద్ధ సప్తమి సందర్భంగా మంగళవారం రథసప్తమి కార్యక్రమం ఆలయ కమిటీ, గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తోకల సాయన్న, పోశెట్టి, సంతోష్ గౌడ్, ఏషాల రవీందర్, బిల్ల శంకర్, ఆలయ ప్రధాన అర్చకులు రాచప్ప మహారాజ్, అర్చకులు శివప్ప, రాచప్ప, వినోద్ తదితరులు పాల్గొన్నారు.