బోధన్ పట్టణంలోని విజయ మేరీ పాఠశాల సమీపంలో కాలువకు సైడ్ వాల్ లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధన్ - బాన్స్ వాడ ప్రధాన రహదారిపై ఉన్న కాలువకు సైడ్ వాల్ నిర్మించించాలని అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. సైడ్ వాల్ లేక పోవడం వలన బురద నీరు రోడ్డు పైకి వచ్చి వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయని అన్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.