బోధన్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి

67చూసినవారు
బోధన్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఊరెళ్లేవారు జాగ్రత్తలు పాటించాలి
సంక్రాంతి పండుగకు ఊరేళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై మచ్చేందర్ రెడ్డి సూచించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బోధన్ రూరల్ ప్రాంత ప్రజలు సంక్రాంతి పండుగకు ఊరేళ్ళే వారు ఇంట్లో విలువైన వస్తువులను, నగదు ఉంచొద్దని, బ్యాంక్‌ లాకర్లలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. ఇంటిముందు చెప్పులు ఉంచాలని, బయటగేటుకు లోపల నుంచి తాళం వేయాలన్నారు. ఇంటి ముందు గదిలో లైట్‌ వేసి ఉంచాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్