బోధన్ మండలంలోని సాలంపాడ్ క్యాంపు, కొప్పర్తి గ్రామాల మధ్య గల ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తన సిబ్బందిని పంపగా ముగ్గురు పేకాట రాయుళ్లని పట్టుకున్నారు. వారి వద్ద నుండి 12,020/- రూపాయల నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు.