నిజామాబాద్ జిల్లాలోని డొంకేశ్వర్ జఫ్స్ స్కూల్ నుండి ఐఐఐటి కి ఏకంగా 26 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో 19 మంది అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ మండలం నుండి మొత్తం 41 మంది విద్యార్థులు ఎంపికవడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు పాఠశాల సిబ్బంది శనివారం అభినందనలు తెలిపారు.