ఇందల్వాయి గ్రామంలో శ్రీ సీతారాముల ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ గ్రామంలోని 250 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయంలో ఈ ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర కలిగి ఉంది. దేశంలో ఎక్కడైనా రాముడి పక్కన సీతా దేవి, లక్ష్మణుడు కలిసి ఉంటారు. కానీ ఇక్కడ రాముడు సీతాదేవి మాత్రమే ఉంటారని గ్రామస్థులు తెలిపారు.