ఎడపల్లి మండల కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల మరియు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేకంగా వాహనాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వివిధ వాహనదారుల వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. 41 వాహనాలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వాహనదారులకు పోలీస్ ఠాణాలో అవగాహన సదస్సును నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.