రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గోదావరి నది ఒడ్డున ఉన్న ఎత్తిపోతల టాన్స్ ఫార్మర్ ను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులోని రాగితీగలు, ఆయిల్ నుఎత్తుకెళ్లారు. 500కేవీ సామర్థ్యం ఉన్న టాన్స్ ఫార్మర్ ధ్వంసం కావడంతో రూ. 10 లక్షలు వరకు నష్టం జరిగింది. శుక్రవారం రైతులు టాన్స్ ఫార్మర్ ధ్వంసం కావడంతో ఎత్తిపోతల చైర్మన్ మౌలానాకు సమాచారం అందించారు. రెంజల్ పీఎస్ లో ఫిర్యాదు చేయగా, ఘటన స్థలంను ఎస్సై చంద్రమోహన్ పరిశీలించి కేసు నమోదు చేశారు.