బోధన్ మండలంలో వ్యక్తి దారుణ హత్య

8చూసినవారు
బోధన్ మండలంలో వ్యక్తి దారుణ హత్య
బోధన్ మండలం మినార్పల్లిలో దేశ్య నాయక్ (57) అనే వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. కుటుంబ వివాదంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. చుట్టూ పక్కల ఉండే వారు వెళ్లి చూసే సరికి దేశ్య నాయక్ రక్తపు మడుగులో ఉన్నారు. ఆసుపత్రికి తరలించినా చికిత్స ఫలించలేదు. కుటుంబ సభ్యులపై అనుమానంతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్