బోధన్ మండలం రాజీవ్ నగర్ తండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో అసిస్టెంట్ లైన్ మెన్ మృతి చెందాడు. ఎల్సీ తీసుకోకుండానే విద్యుత్ స్తంభంపై ఎక్కడంతో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగింది. మృతుడు ఎడపల్లికి చెందిన మహేందర్ గా గుర్తించారు. ఎల్సీ తీసుకోకపోవటంతో ఘటన చోటుచేసుకుందని విద్యుత్ శాఖ డీఈ ముక్తార్ గురువారం తెలిపారు.