నిజామాబాద్: భర్తను హత్య చేసిన భార్య

3చూసినవారు
నిజామాబాద్: భర్తను హత్య చేసిన భార్య
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం మినార్ పల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది, భర్తను భార్య అతికిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్య నాయక్ గొంతుకోసి ఆయన భార్య సాలుబాయి హతమార్చిందని రూరల్ ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి శనివారం తెలిపారు. శుక్రవారం రాత్రి భార్యభర్తల మధ్య వివాదం నెలకొనగా దేశ్య నాయక్ ఇంటిలో అరుపులు కేకలు విన్న స్థానికులు హుటాహుటిన చేరుకోగా దేశ్య నాయక్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడము గమనించి బోధన్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్ఐ వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్