బోధన్ మండలం ఊట్‌పల్లి గ్రామం అందకారంగా మారిపోయింది. సోమవారం రాత్రి కురిసిన గాలి వానకి భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఉదయం నుండి విద్యుత్ సరఫరా లేకపోవడంతో గ్రామంలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మంగళవారం రాత్రి 9 గంటలు గడుస్తున్నా విద్యుత్ మరమ్మత్తుల విషయంలో ట్రాన్స్ కో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.