బోధన్ మరియు సాలూర మండలాలలోని గ్రామాలలో చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు నత్తనడకన సాగుతున్నాయి. పలు గ్రామాలలోనైతే ఇప్పటి వరకు పాఠశాలల మరమ్మత్తు పనులు ప్రారంభించకపోవడం సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గుత్తి దారులు ముందుకు రాకపోవడమే కారణమంటూ పిఆర్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2 రోజుల్లో పాఠశాలల పున ప్రారంభం కానున్న విషయం అందరికీ తెలిసిందే.