సాలురా మండలం హుంస, మంధర్నా, తగ్గేల్లి, పోతాంగల్ మండలం సుంకిని మంజీరా పరివాహక ప్రాంతం నుండి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. బోధన్ మండలం పెంట మీదుగా బోధన్ పట్టణానికి రవాణా చేస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారుల నిర్లక్ష్యం పలు అనుమానాలకు దారితీస్తుంది. పోలీసుల ముందు నుండి ఇసుక ట్రాక్టర్లు వెళుతున్న పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాఫియాకు అధికారుల సహకారం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు.