శివ దీక్ష చేపట్టిన శివ స్వాములు దీక్షలో భాగంగా బోధన్ నుండి శ్రీశైల క్షేత్రం వరకు బుధవారం పాదయాత్రగా బయలుదేరారు. మిగతా స్వాములు చక్రేశ్వర ఆలయం నుండి పట్టణ పొలిమేర వరకు పాదయాత్రగా వెళ్లడం జరిగింది. ఈ పాదయాత్ర 12 రోజులు ప్రతినిత్యం 30 నుండి 40 కిలోమీటర్లు జరుగుతుందని యాత్ర స్వాములు తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా బోధన్ నుండి శ్రీశైలం వరకు ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.