బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ గా శ్రీనివాస్ ప్రసాద్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ బదిలీల్లో భాగంగా బాన్సువాడ ఆసుపత్రి నుండి బోధన్ కు బదిలీ అయ్యానని తెలిపారు. గతంలో రెండు సంవత్సరాలు బోధన్ జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహించానని, ఇక్కడి పరిస్థితుల గురించి తనకు అనుభవం ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి కృషి చేస్తానన్నారు.