బోధన్ పట్టణంలోని అనిల్ టాకీస్ రోడ్డు సమీపంలో ఉన్నటువంటి షర్బతి కెనాల్ లో గుర్తుతెలియని మగశవం లభ్యం అయినట్లు పట్టణ ఠాణా సిఐ శనివారం తెలిపారు. ఆ శవాన్ని పోలీసులు బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చరీలో భద్రపరిచారు. గుర్తుపట్టిన వారు పట్టణ ఠాణాలో తెలియపరచాలని పోలీసులు తెలిపారు.