వర్ని మండలం బడాపహాడ్ లో శుక్రవారం నుండి 13 వరకు జరిగే హజరత్ సయ్యద్ శాదుల్లా హుస్సేన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు జరగనున్న సందర్భంగా ప్రజలకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సవాల్లో పాల్గొనే భక్తులందరి కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, కావున దర్శనం కోసం భక్తులు సంయమనం పాటించాలని, క్యూ లైన్లలో వెళ్లి దర్శించుకోవాలని అన్నారు.