వర్ని మండలంలోని బడా పహాడ్ బస్టాండు నందు గురువారం గుర్తు తెలియని వ్యక్తి మరణించిన ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజులుగా బిక్షాటన చేస్తూ చలి తీవ్రతతో అనారోగ్యంతో మరణించారని దర్గా సెక్యూరిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురిలో ఉన్నట్టు తెలిపారు.