విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఎల్లారెడ్డి శాఖ అధ్వర్యంలో, బుధవారం చత్రపతి శంబాజీ మహారాజ్ 368 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ ప్రాంతంలో ఆయన భారీ చిత్ర పటానికి పూలమాలలు వేసి, టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ పరాక్రమాన్ని పునికి పుచ్చుకున్న మహావీరుడు అని కొనియాడారు.