కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాం గ్రామంలో శనివారం గ్రామంలోని చెరువులో ప్రమాదవ శాత్తు పడి రైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బేగారి దశరథం(52) తన పంట పొలానికి నీటిని తోడెందుకు మోటారును పెద్ద చెరువు కుంటలో వేశాడు. మోటారు మొరాయించడంతో దాన్ని తీసే క్రమంలో కాలు జారి నీటి కుంటలో పడి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. మృతుని భార్య అయిన లింగవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.