పిట్లం మండలంలోని గౌరారం తండాలో భవాని మాత, సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిర్ 3వ సంవత్సర వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేతో పాటు మహారాష్ట్ర ఎమ్మెల్సీ బాబూసింగ్ మహారాజ్ పాల్గొన్నారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.