కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో హరిజన బస్తీలో చోరీ చేసేందుకు వచ్చి మహిళను ఓ దుండగుడు హత్య చేశాడు. ఆదివారం మధ్యాహ్నం గోనే కాశవ్వ (65) ఇంట్లో ఓ దొంగ చొరబడి ఆమెను గోడకేసి కొట్టి చంపి ఇంట్లో వస్తువులను చోరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇంటి ముందు ఉన్న మహిళ ప్రశ్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నామని బిచ్కుంద ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు.