కామారెడ్డి జిల్లాలో 2024-25 రబీ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోలు జోరుగా కొనసాగుతోందనిజిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 446 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 58, 655 మంది రైతుల నుండి 735 కోట్ల విలువైన 3. 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా తృతీయ స్థానంలో నిలిచిందనీ తెలిపారు.