ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలపై జిల్లా అధికారులకు నివేదిస్తామని, వారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటారని ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ డిఆర్పి, ఎస్ఆర్పి తెలిపారు. బీబీపేట మండలంలో రెండు కోట్ల పైగా ఉపాధి హామీ పథకం పనులపై వివిధ గ్రామాల్లో సామాజిక తనిఖీ నిర్వహించామన్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన అవినీతి అవకతవకలపై జిల్లా అధికారులకు నివేదికలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పూర్ణచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.