మంత్రాల నేపంతో ఒకరిపై దాడి

84చూసినవారు
మంత్రాల నేపంతో ఒకరిపై దాడి
మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూరులో ఓ వ్యక్తిపై ఆదివారం అర్ధరాత్రి దాడి జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గడ్డమీది సాయిలుపై గతంలో మంత్రాలు చేస్తున్నాడని దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి సాయిలుపై మళ్ళీ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన సాయులును పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ఫిర్యాదు లేకున్నా పోలీసులు సంఘటనపై విచారిస్తున్నారు.

సంబంధిత పోస్ట్