మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ప్రజలకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లో టీపీకేబి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి మట్టి గణపతులను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ. గణేష్ నవరాత్రులలో వినాయకుని ప్రతిమలను పూజించడం, అనంతరం నీటి వనరులలో నిమజ్జనం చేయడం మన సాంస్కృతిలో భాగమని అన్నారు.