నిర్ణీత గడువులోగా సీఎంఆర్ సరఫరా చేయని వారిపై చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో పౌరసరఫరాల అధికారులతో సమావేశం జరిగింది. ఈ నెల 30లోగా సరఫరా చేయని పక్షంలో అపరాధ రుసుము విధించడంతో పాటు, వచ్చేవానాకాలంలో ధాన్యం కేటాయింపులు జరుగవన్నారు. ఖరీఫ్ సీజన్ 2021- 23 డిఫాల్ట్ మిల్లులపె క్రిమినల్ చర్యలు, రెవెన్యూ రికవరీ యాక్ట్ క్రింద చర్యలుంటాయన్నారు.