కామారెడ్డి జిల్లా దోమకొండ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని, వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుపై మండల వాసులు ఆశగా చూస్తున్నారని మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సూచన మేరకు ఆయన గురువారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను పరిశీలించి, రోగులతో మాట్లాడారు.