కామారెడ్డి పట్టణంలో శుక్రవారం పేలుడు పదార్థాలను పట్టుకున్నట్లు ఏఎస్పీ చైతన్యరెడ్డి చెప్పారు. కేపీఆర్ కాలనీలో శ్రీధర్ కు చెందిన ప్లాట్లో బండరాళ్లను బ్లాస్టింగ్ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇందులో నలుగురిని అదుపులో తీసుకొని వారి నుంచి 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, 16 కార్డెక్స్ వైర్ బండిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ మీడియాతో చెప్పారు.