భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడంతో అతని అంత్యక్రియలకు కట్టెలు తీసుకువస్తున్న ట్రాక్టర్ మంగళవారం బోల్తా పడడంతో అందులో ఉన్న 8 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.